Nigeria Boat Accident : నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడమే ఇందుకు కారణం.
పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలు వెలికితీశారు.
పెను విషాదం.. పడవ మునిగి 76 మంది మృతి - నైజీరియా బోటు బోల్తా మృతి
Nigeria Boat Accident: వరదల కారణంగా పడవ మునిగిన ఘటనలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో ఆదివారం జరిగిందీ ఘోర దుర్ఘటన.
Nigeria Boat Accident
ఈ దుర్ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారుల్ని నైజీరియా అధ్యక్షుడు ఆదేశించారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 10, 2022, 6:57 AM IST