తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2023, 6:47 AM IST

ETV Bharat / international

పోలీసులే లక్ష్యంగా కాల్పులు.. పాక్​లో 9 మంది మృతి.. అమెరికాలో మరో ఆరుగురు..

పాకిస్థాన్​లో ఉగ్రవాదులు పోలీసు ప్రధాన కార్యాలయంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 18 మంది గాయాలపాలయ్యారు. మరోవైపు అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు.

several people died due to shooting in America and Pakistan
అమెరికా, పాకిస్థాన్​లో కాల్పులు

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. భారీగా ఆయుధాలు ధరించిన 8 మంది పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్లు కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై కాల్పులకు దిగారు. పోలీసులు, సైన్యం ప్రతిఘటించడంతో 5 గురు తీవ్రవాదులు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పోలీసలు యునిఫామ్‌ ధరించి పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినట్లు డీఐజీ ఇర్ఫాన్ తెలిపారు.

పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ముగ్గురు తీవ్రవాదులు తమను తాము కాల్చుకొని చనిపోయినట్లు చెప్పారు.ఉగ్రవాదులు మెుదట గ్రనెడ్లతో దాడి చేసి.. అనంతరం విచక్షారాహితంగా కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు మెుదట గ్రనెడ్లతో దాడి చేసి కార్యాలయంలోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన విదేశీ క్రికెటర్ల హోటళ్లు కరాచీ పోలీసు కార్యాలయానికి దగ్గరగా ఉండటంతో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.కాగ గతనెలలో మసీదులో ఆత్మాహుతి దాడిలో 150 మందికిపైగ మరణించారు

అమెరికా కాల్పుల్లో ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ గర్జన కలకలం సృష్టించింది. టెన్నెస్సీ రాష్ట్రంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మిస్సిస్సిపీలోని అర్కాబుట్ల అనే ఓ చిన్న పట్టణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఒక్కడే కాల్పులు జరిపినట్లు భావిస్తున్న పోలీసులు అందుకు గల కారణాలను విచారణ జరుపుతున్నారు. మెంఫిస్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే అర్కాబుట్ల పట్టణంలో 285 మంది మాత్రమే నివసిస్తారని 2020 జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details