Plane Crash News: హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న సైజు విమానం.. సోడా బాటిళ్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం జాక్మెల్ సౌథర్న్ కోస్టల్ సిటీకి వెళ్లే క్రమంలో ఓ చోట ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. విమానం సీటింగ్ కెపాసిటీ ఐదు మాత్రమే అని చెప్పారు.
ట్రక్కును ఢీకొన్న విమానం.. ఐదుగురు దుర్మరణం - విమాన ప్రమాదం
Plane Crash: చిన్న సైజు విమానం సోడా ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ట్వీట్ చేశారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు. సరిగ్గా 9 నెలల క్రితం జాక్మెల్ వెళ్తున్న ఓ విమానం కూడా పోర్ట్ అవ్ ప్రిన్స్లోనే ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా మిషనరీస్ ఉన్నారు. కిడ్నాప్‌లు, ముఠా తగాదాలు పెరుగుతున్న క్రమంలో పోర్ట్ అవ్ ప్రిన్స్ నుంచి చిన్నసైజు విమానాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లడం హైతిలో సాధారణంగా మారింది. ప్రత్యేకించి మార్టిసాంట్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి:రష్యా గుప్పిట్లో మరియుపోల్.. 'మాకు ఇవే చివరి రోజులు'