Nepal LandSlides : నేపాల్‌లోని అచ్చాం, సుదూర్‌పశ్చిమ్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రకృతి భీభత్సానికి అక్కడి రహదార్లు పూర్తిగా ధ్వంసమవ్వడంతో గాయపడ్డ మరో 11మందిని వాయుమార్గంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా అక్కడ కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.