తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్‌షీ రాష్ట్రంలో నాన్చాంగ్లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు వల్ల హైవేపై వెళ్తున్న వాహనాలు.. ఒకదానిని మరొకటి ఢీకొన్నట్లు సమాచారం. కాగా, నాన్‌చాంగ్ సిటీ బయట జరిగిన ఈ ఘటనలో ఎన్ని వాహనాలు ఢీకొన్నాయనే వివరాలపై స్పష్టత లేదు.
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం.. మరో 22 మంది..
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. దట్టమైన పొగమంచు వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.
ఈ నెలాఖరులో లూనార్ కొత్త సంవత్సర వేడుకలు ఉన్నాయి. దీంతో సెలవు రోజుల్లో వివిధ నగరాల్లో పనిచేసే వాళ్లు.. తమ సొంత ఊళ్లకు వెళతారని అధికారులు చెప్పారు. దాని కారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయాల్లో అన్ని వాహనాలు ఫుల్ లోడ్‌తో వెళ్తాయన్నారు. ఫిట్నెస్ నేని వాహనాలు, కెపాసిటీకి మించి ఓవర్‌లోడ్‌తో వెళ్లడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. దీనికి తోడు కొవిడ్ ఆంక్షలు ఎత్తేయడం వల్ల కొత్తఏడాది పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని వెల్లడించారు.