china earthquake: చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 14 మంది గాయాల పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం సిచుయాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి 4.5 తీవ్రతతో నమోదైంది. మరణించిన వారిని యాన్ నగరానికి చెందిన వారిగా గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యల కోసం 800 మంది వైద్య, పోలీస్ సిబ్బందిని తరలిచింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 2008లో సిచుయాన్లో తలెత్తిన భూకంపంలో సుమారు 90వేల మంది మరణించారు.
చైనాను కుదిపేసిన భారీ భూకంపం.. నలుగురు మృతి
china earthquake: చైనాలోని సిచుయాన్ నగరంలో సంభవించిన భూకంపంలో నలుగురు మరణించారు. మరో 14 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలో తుపాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వరదల కారణంగా 33 మంది గల్లంతయ్యారు.
Mexico Hurricane: మెక్సికోలో 'అగాథ' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా సుమారు 13 మంది మరణించారు. వరదలు, కొండ చరియలు విరిగి పడడం వల్ల 33 మంది గల్లంతైనట్లు ఒక్సాకా గవర్నర్ తెలిపారు. తీరం వెంట ఉన్న సుమారు 40వేల మందిపై వరదల ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. తూర్పు పసిఫిక్ ప్రాంతంలో మే నెలలో వచ్చిన అతిపెద్ద తుపానుగా ఇది రికార్డైంది. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులు, భారీ వర్షాల ధాటికి మెక్సికో దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంత పట్టణాలు వణికిపోతున్నాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:అక్కడ వంట నూనె ధర ఒకేసారి రూ.213 పెంపు.. లీటర్ ఎంతంటే?