తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి - pakistan accident snow

అతివేగంగా వస్తున్న ఓ బస్సు.. కారును ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. పాకిస్థాన్​లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

several killed in pakistan accident
several killed in pakistan accident

By

Published : Feb 8, 2023, 7:16 AM IST

Updated : Feb 8, 2023, 8:31 AM IST

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ఓ ప్యాసింజర్​ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. వాయువ్య పాకిస్థాన్​లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిల్గిత్​ బాల్టిస్థాన్​లోని దయామిర్​ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. గిల్గిత్​ నుంచి రావల్పిండి వెళ్తున్న ప్యాసింజర్​ బస్సు.. బలంగా కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు.. లోయలో పడిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాకిస్థాన్​లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత నెలలో బలూచిస్థాన్‌లో ఓ ప్రయాణికుల వాహనం లోయలో పడి 41 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2018లో పాక్​లో రోడ్డు ప్రమాదాల వల్ల 27,000 మందికి పైగా మరణించారు.

Last Updated : Feb 8, 2023, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details