తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. 42 మంది మృతి - balochistan road accident news

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు యూ టర్న్​ తీసుకుంటున్న సమయంలో పిల్లర్​ను ఢీకొని లోయలో పడి మంటలు చెలరేగాయి. వాహనంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉండగా.. 42 మంది మృతి చెందారు.

Pakistan Balochistan Road Accident
పాకిస్థాన్​లో లోయలో పడి 42 మంది మృతి

By

Published : Jan 29, 2023, 11:52 AM IST

Updated : Jan 29, 2023, 5:59 PM IST

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 42 మంది మరణించారు. బలూచిస్థాన్​లోని లాస్బెలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. బస్సులోని 48 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్​ అంజా అంజుమ్​ తెలిపారు.

బస్సు.. క్వెట్టా ప్రావిన్స్​ నుంచి రాజధాని కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్బెలా సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా వంతెన పిల్లర్‌ను ఢీకొని లోయలో పడి మంటలు అంటుకున్నాయని.. దీంతో 39 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని అంజా అంజుమ్​ వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనపై ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాలు
రోడ్డు ప్రమాదానికి గురైన బస్సు
Last Updated : Jan 29, 2023, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details