తెలంగాణ

telangana

ETV Bharat / international

స్టేడియంలో ఫ్యాన్స్ గొడవ.. 125 మంది దుర్మరణం

ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది దుర్మరణం పాలయ్యారు. 180 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

.
.

By

Published : Oct 2, 2022, 6:34 AM IST

Updated : Oct 2, 2022, 8:45 PM IST

ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన జరిగింది. ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన అల్లర్లలో 125 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 180 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే గాయపడిన వారి వివరాలు కచ్చితంగా తెలియరాలేదు. మొదటగా 174కు చేరిందని వార్తలు వచ్చాయి. కొన్ని మృత దేహాలను రెండు సార్లు లెక్కించడం ద్వారా ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. 100 మందికి పైగా క్షతగాత్రులకు 8 ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స అందుస్తున్నారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

లాఠీఛార్జ్ చేస్తున్న పోలీసులు

అయితే ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 34 మంది అక్కడిక్కడే మరణించగా.. మిగిలిన వారు ఆస్పత్రికి తరలించగా మృతిచెందారని పేర్కొన్నారు. సుమారు 300 మంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసు అధికారులు, పిల్లలు, అభిమానులు మరణించినట్లు చెప్పారు.

అభిమానులు ధ్వంసం చేసిన పోలీసు వాహనం
లాఠీఛార్జ్ చేస్తున్న పోలీసులు

ఈస్ట్ జావాలో జరిగిన ఇండోనేషియన్ లీగ్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. సొంత మైదానంలో చిరకాల ప్రత్యర్థులు చేతిలో ఓటమిపాలయ్యామని ఆగ్రహించిన అభిమానులు.. మైదానంలో అల్లర్లకు తెరదించారు. ఫలితంగా ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. అభిమానులు మైదానంలోకి చేరి రచ్చ చేయడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. మైదానంలోకి దిగిన వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌ చేశారు.

మైదానంలోకి చొచ్చుకువస్తున్న అభిమానులు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

అనేక మంది అభిమానులు కంచెలను దాటి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మైదానం నుంచి ఆందోళనకారులను బయటకు పంపించగా.. వీధుల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారని స్థానిక మీడియా తెలిపింది.

టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు
టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు

ఇవీ చదవండి:దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్​ ప్రోమో.. మీరు చూశారా?

Last Updated : Oct 2, 2022, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details