ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం బౌగురు గ్రామంలో గుండా ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి ఓ మైనింగ్ గనిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సహాయ చర్యలు చేపట్టిన సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఆఫ్రికాలో పేలిన బాంబు.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు
ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతలను కట్టుదిట్టం చేసి.. గల్లంతైన ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు బుర్కినా ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. శనివారం కూడా ఔగరా, మటియాకోలీ ప్రాంతాల్లో ఓ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మృతిచెందారు.
అల్-ఖైదా-ఇస్లామిక్ స్టేట్ మధ్య ఘర్షణల కారణంగా బుర్కినా ఫాసోలో రోజురోజుకి హింస పెరుగుతోంది. దీంతో వేలాది మంది అమాయక పౌరులు మరణిస్తున్నారు. ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ దాడుల్లో.. లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు.. దేశంలోని హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజాసంఘాలు ఆరోపించాయి.