ఘోర రోడ్డు ప్రమాదం.. 200 అడుగుల లోతు లోయలో పడ్డ జీపు.. ఏడుగురు మృతి - బజాంగ్ రోడ్డ్ ప్రమాదం
నేపాల్లో ఓ జీపు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు.
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం
నేపాల్లో బజాంగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఓ జీపు కిక్కిరిసిన జనాలతో చైన్పుర్ నుంచి ఖేత్కోట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ, పోలీసులు.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ జీపులో ఎంత మంది ప్రయాణిస్తున్నారన్న విషయం తెలియలేదని పోలీసులు చెప్పారు.
Last Updated : Oct 19, 2022, 10:28 PM IST