Senegal hospital fire: ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల వార్డులో మంటలు చెలరేగి వీరంతా మరణించారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లోని టివయూనే పట్టణంలో బుధవారం జరిగిందీ ఘటన.
దారుణం.. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి - undefined
ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లోని టివయూనే పట్టణంలో జరిగిందీ ఘటన.

దారుణం.. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి
ప్రమాదం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆ దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సదస్సు కోసం జెనీవా వెళ్లి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దులాయే డియూఫ్ సర్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని, స్వదేశానికి పయనమయ్యారు.
సెనెగల్‌లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. లింగూరీలో ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు నవజాత శిశువులు మరణించారు.
TAGGED:
senegal hospital fire