రష్యాలోని ఓ పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పిల్లలు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
స్కూల్లో కాల్పులు.. 15 మంది బలి.. మృతుల్లో 11 మంది చిన్నారులు - Attack on Russian school
సాయుధ దుండగుడు ఓ పాఠశాలలో బీభత్సం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 11 మంది చిన్నారులు సహా మొత్తం 15 మందిని బలిగొన్నాడు. రష్యాలోని ఇజెవ్స్క్లో సోమవారం జరిగిందీ ఘటన.
RUSSIA-SCHOOL-SHOOTING
రష్యాలోని ఉడ్ముర్టియా ప్రాంత రాజధాని ఇజెవ్స్క్లో సోమవారం జరిగిందీ ఘటన. 1 నుంచి 11 తరగతి వరకు విద్యార్థులు ఉండే పాఠశాలలోకి దుండగుడు తుపాకీతో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ పాఠశాలను చుట్టుముట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
Last Updated : Sep 26, 2022, 7:06 PM IST