Russia Ukraine War: ఓ వైపు తి చర్చలు జరుపుతూనే... మరోవైపు పరస్పరం దాడులకు దిగుతున్నాయి రష్యా, ఉక్రెయిన్. తమ ప్రాంతంలోని చమురు డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు దాడి చేశాయని రష్యాలోని బెల్గోరడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. చమురు డిపోలో పేలుడు, అగ్నిప్రమాదం ఫొటోలు, వీడియోలను రష్యన్ మీడియా ప్రచురించింది. ఈ తరహా దాడులు శాంతి చర్చలకు విఘాతంగా మారతాయని క్రెమ్లిన్ ప్రతినిధి మండిపడ్డారు. దాడి విషయాన్ని పుతిన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రష్యాకి చెందిన చమురు డిపోపై దాడిలో తమ బలగాల ప్రమేయం ఉందో లేదో తెలియదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అన్నారు.
Russia Ukraine Conflict: మైకోలైవ్‌లోని రీజినల్ అడ్మినిస్ట్రేటివ్ భవనంపై మంగళవారం జరిగిన రష్యన్ క్షిపణి దాడిలో మరణించినవారి సంఖ్య 28కు పెరిగినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. అటు మరియూపోల్‌లో చిక్కుకున్న వారిని తరలించేందుకు బయల్దేరిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా బలగాలు అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అక్కడి వారి కోసం పంపిస్తున్న ఆహారం, ఔషధ సరఫరాలను కూడా రష్యా సైనికులు స్వాధీనం చేసుకుంటున్నట్లు మండిపడింది. చెర్నీహివ్‌కు దక్షిణాన ఉన్న స్లోబోదా, లుకాషివ్కా గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.