ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా దాదాపు 85 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆయన వెల్లడించారు. రష్యా దాడుల తర్వాత చాలా నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని జెలెన్స్కీ తెలిపారు. రష్యా దాడులకు భయపడమని.. ఇవి ప్రణాళికతో చేసిన దాడులని ఆయన అన్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధికారి.. క్షిపణుల దాడిని క్లిష్టమైనవిగా అభివర్ణించారు. ఉక్రేనియన్లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పలు నివాస భవనాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. కీవ్‌లో ఐదు అంతస్తుల నివాస భవనం అగ్నికి ఆహుతైందిని.. మరో మూడు నివాస భవనాలు ధ్వంసమయ్యాయని అన్నారు.