తెలంగాణ

telangana

ETV Bharat / international

లక్ష్యం చేరేదాక యుద్ధం ఆగదు: పుతిన్​ - ఉక్రెయిన్ న్యూస్​

ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్​పై సైనికచర్య సాగుతోందని చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు నేరవేరే వరకు వెనక్కితగ్గబోమని స్పష్టం చేశారు.

russia ukraine news
లక్ష్యం చేరేదాకు యుద్ధం ఆగదు: పుతిన్​

By

Published : Apr 12, 2022, 9:23 PM IST

తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు నేరవేరే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్‌పై సైనికచర్య సాగుతోందని తెలిపారు. వోస్టోచిలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించిన పుతిన్.. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోందంటూ జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలను ఖండించారు.

బుచా ప్రాంతంలో వందలాది పౌరులను రష్యా సేనలు హతమార్చయనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు పుతిన్​. నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనేసైనికచర్య వేగంగా కదలడం లేదని పేర్కొన్నారు. ఇటీవల.. రష్యా అధికారులతో చర్చల సందర్భంగా ఉక్రెయిన్‌ చేసిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకుందని తెలిపారు. అందుకే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్‌పై సైనిక చర్యను కొనసాగించడం మినహా తమకు మరోమార్గం లేదని పుతిన్‌ స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:'మరియుపోల్​లో 10 వేల మంది పౌరులు మృతి!'

ABOUT THE AUTHOR

...view details