Russia ukraine war: ఉక్రెయిన్‌పై సైనికచర్యను నిలిపివేసేందుకు రష్యా మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. చర్చలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొనేందుకే కీవ్ నుంచి బలగాలను ఉపసంహరణ చేపట్టినట్లు క్రెమ్లిన్ తెలిపింది. నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలనే షరతుకు ఒప్పుకోవాలని రష్యా అంటోంది.
'జెలెన్‌స్కీ అందుకు ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తాం' - రష్యా ఉక్రెయిన్ వార్
Russia ukraine war: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌పై సైనికచర్యను నిలిపివేసేందుకు రష్యా మరో ప్రతిపాదన చేసింది. నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలనే షరతుకు ఒప్పుకోవాలని రష్యా అంటోంది. నాటో నిబంధనల మాదిరిగా పశ్చిమ దేశాల నుంచి చట్టబద్ధమైన భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.
నాటో నిబంధనల మాదిరిగా పశ్చిమ దేశాల నుంచి చట్టబద్ధమైన భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. గతవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రత్యక్ష చర్చల తర్వాత కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించటంతో పుతిన్-జెలెన్ స్కీ మధ్య చర్చలకు అవకాశం ఏర్పడింది. కానీ కీవ్ శివారులోని బుచా పట్టణంలో వెలుగుచూసిన మారణహోమంతో చర్చలపై జెలెన్‌స్కీ వైఖరి మారిపోయింది. ఉక్రెయిన్ లో యుద్ధనేరాలకు పాల్పడినట్లు రష్యా అంగీకరిస్తే కానీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఉక్రెయిన్లో హత్యలను ఖండించిన భారత్