Russia Missile Attack on Ukraine :ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై రష్యా చేసిన దాడిలో 19 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. డ్రోన్లు, క్షిపణులతో ఒడెసాపై విరుచుకుపడింది. ఈ దాడిలో చిన్నారులు, మహిళలతో పాటు మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జపోర్జియాలో నిర్వహించిన మిలటరీ అవార్డుల కార్యక్రమంపై ఈ దాడి జరిగింది.
రష్యా క్షిపణి దాడిలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి- అవార్డుల కార్యక్రమంలో - russian attack odessa ukraine
Russia Missile Attack on Ukraine : రష్యా క్షిపణి దాడిలో 19 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరో 8 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. జపోర్జియాలో నిర్వహించిన మిలటరీ అవార్డుల కార్యక్రమంపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.
By PTI
Published : Nov 6, 2023, 5:20 PM IST
|Updated : Nov 6, 2023, 9:15 PM IST
యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆర్ట్ మ్యూజియం కూడా స్వల్పంగా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మ్యూజియంలోని ఎన్నో వస్తువులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భవనంలోని అద్దాలు పగిలిపోయాయనీ ప్రస్తుతం వాటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మ్యూజియం బయట భారీ గుంత ఏర్పడింది. దీనిపై స్పందించిన అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించారు ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తం ఉమ్రేవ్. సైనిక అధికారులే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. రష్యా ఆధీనంలోని క్రిమియా సమీపంలోని జలీవ్ షిప్‌యార్డ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులు చేశాయని.. దీనికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Russia Missile Test Today : ఇప్పటికే ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా.. అణ్వస్త్ర ప్రయోగాలపై దృష్టి సారించడం కలకలం రేపుతోంది. అమెరికాతో సమానంగా అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగిన క్రెమ్లిన్... అణు జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. సముద్రం నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి బులావా ప్రయోగం విజయవంతమైందని ఆ దేశం ప్రకటించింది. ఆర్కిటిక్ తీరంలోని యూరోపియన్ దేశాల వైపున ఉన్న సముద్రంలో దీన్ని పరీక్షించినట్లు తెలిపింది. అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించినట్లు వెల్లడించింది.