రష్యాలోని సఖాలిన్ ద్వీపంలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటారేమోనని వాటిని తొలగించారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు చిన్నారులు సహా 9 మంది మృతి - రష్యా బ్లాస్ట్ లేటెస్ట్ న్యూస్
రష్యాలో ఓ అపార్టుమెంటులో గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
రష్యాలో పేలిన గ్యాస్ సిలిండర్
అయితే "భవనంలో నివసిస్తున్న 33 మంది ఆచూకీ తెలియలేదు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని" సఖాలిన్ గవర్నర్ వాలెరీ లిమరెంకో టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బాంబు దాడిలో ఇల్లు కోల్పోయిన వారికి తాత్కాలికంగా పునరావాసం కల్పించి, ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Last Updated : Nov 19, 2022, 3:57 PM IST