రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించారు. ఓ వ్యక్తి ఫ్లేర్ గన్‌ని ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రష్యాలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది మృతి! కాల్పులే కారణం - రష్యా కేఫ్‌లో అగ్ని ప్రమాదం
రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించారు.
fire accident in russia
Last Updated : Nov 5, 2022, 1:34 PM IST