Russia Defence Ministry Fire: ఈశాన్య రష్యా టీవర్ నగరంలోని రక్షణ శాఖ పరిశోధన కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 27 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నామని.. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రష్యా రక్షణ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
Russia Defence Ministry Fire: రష్యాలోని టీవర్ నగరంలోని రక్షణ శాఖ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 27 మంది గాయపడ్డారు. పాతబడిన వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా భావిస్తోంది.
రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్సెస్ సెంట్రల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే భవనంలోని పైమూడు ఫ్లోర్లకు కూడా వ్యాపించింది. దీంతో అందులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అధికారుల సూచనల మేరకు భవనం కిటీకల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. ఈ దుర్ఘటనకు కారణం పాతబడిన వైరింగే అని స్థానిక మీడియా భావిస్తోంది. ఈ భవనంలో ప్రధానంగా వాయుసేన సాంకేతికత అభివృద్దికి సంబందించిన పరిశోధనలు జరుగుతుంటాయి.
ఇదీ చూడండి :'నాటోలో చేరొద్దు'.. ఆ దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్!