తెలంగాణ

telangana

ETV Bharat / international

Russia Attack On Ukraine : ఉక్రెయిన్​ మార్కెట్​పై రష్యా క్షిపణి దాడి.. 16 మంది మృతి.. మరో 20మందికిపైగా..

Russia Attack On Ukraine Today : ఉక్రెయిన్​లోని ఓ మార్కెట్​పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 16 మంది మరణించగా.. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో దుకాణాలు భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Russia Attack On Ukraine Today
Russia Attack On Ukraine Today

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 7:00 PM IST

Updated : Sep 6, 2023, 7:17 PM IST

Russia Attack On Ukraine Today : ఉక్రెయిన్​పై మరోసారి రష్యా భీకరదాడికి పాల్పడింది. కోస్ట్యాంటినివ్కా నగరంలోని మార్కెట్​పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 16 మంది మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ప్రధాని డెనిస్ ష్మిహాల్ వెల్లడించారు.

ఘటనాస్థలిలో అనేక దుకాణాల్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసినట్లు సమాచారం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. అయితే రాజధాని కీవ్​లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. ఉక్రెయిన్​కు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే రష్యా దాడి జరపడం గమనార్హం.

అప్పుడు కూడా..
Blinken Ukraine Visit :అంతకుముందు బ్లింకెన్..​ పోలాండ్​ నుంచి రైలు మార్గంలో కీవ్​కు వస్తున్న సమయంలోనూ ఆ ప్రాంతమంతా క్షిపణి దాడులతో దద్దరిల్లిపోయింది. వీటిల్లో కొన్నింటిని తాము కూల్చేశామని ఉక్రెయిన్‌ బలగాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఏ ప్రపంచ స్థాయి నాయకుడు కీవ్‌ పర్యటనకు వచ్చినా.. రష్యా దాడులను తీవ్రతరం చేస్తూనే ఉంది. రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి బ్లింకెన్‌.. ఉక్రెయిన్​లో పర్యటించడం ఇది మూడోసారి.

విమానాలపై కారు టైర్లు కప్పి..
Russia Ukraine War Updates :మరోవైపు,రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ చేస్తున్న దాడులు మాస్కోను భయపెడుతున్నాయి. దీంతో తమ వ్యూహాత్మక బాంబర్‌ విమానాలను డ్రోన్ల నుంచి రక్షించుకోవడానికి రష్యా కారు టైర్లను ఆశ్రయించింది. విమానాల రెక్కలపై వీటిని ఒక పొరలా పేర్చింది. దీనికి సంబంధించిన చిత్రాలను ఓ ప్రైవేటు ఉపగ్రహ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రాలను రష్యాలోని ఎంగెల్స్‌ ఎయిర్‌ బేస్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Ukraine Air Strikes : డ్రోన్‌దాడుల నుంచి నష్టం జరగకుండా చేస్తున్న ఓ ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. థర్మల్‌ ఎక్సపోజర్‌ నుంచి కాపాడటానికి, ఇన్ఫ్రారెడ్‌ కెమెరాల కన్నుగప్పటానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ చిత్రాల్లో టీయూ-95 స్ట్రాటజిక్‌ బాంబర్‌ రెక్కలు, ఎయిర్‌ ఫ్రేమ్‌పై కారు టైర్లు పేర్చి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Last Updated : Sep 6, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details