Kenya Road Accident : పశ్చిమ కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 48 మందిని బలితీసుకుంది. రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై ఓ లారీ దూసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 48 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
Kenya Road Accident Death Toll : శుక్రవారం సాయంత్రం లోండియానిలోని రిఫ్ట్ వ్యాలీ.. కెరిచో-నకురు మధ్య ఉన్న హైవేపై కెరీచో వైపునకు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి.. అక్కడే ఉన్న చిరు వ్యాపారులతో పాటు బస్ స్టాండ్లో వేచి ఉన్న స్థానికుల పైకి దూసుకెళ్లింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. రోడ్డుపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయని అధికారులు తెలిపారు.