ఒకేచోట 10 నిమిషాల్లో 49 వాహనాలు ఢీ.. 16 మంది మృతి - చైనా రోడ్డు ప్రమాదం
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనేక వాహనాలు ఒకేసారి ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.
road accident in china
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 నిమిషాల వ్యవధిలోనే సుమారు 49 వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం హునాన్ ప్రావిన్స్‌లో జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
Last Updated : Feb 5, 2023, 6:17 PM IST