తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రిటన్ ప్రధాని రేసులో ఓడిపోతే?'.. రిషి సునాక్ స్పందన ఇదే - రిషి సునాక్ యూకే పీఎం

Rishi Sunak news: బ్రిటన్ ప్రధానిని నిర్ణయించే టోరీ పార్టీ ఎన్నికల్లో తనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న ప్రశ్నకు రిషి సునాక్ బదులిచ్చారు. పోటీలో ఓడితే తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎంపీగా తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని చెప్పారు.

RISHI SUNAK
RISHI SUNAK

By

Published : Sep 5, 2022, 6:55 AM IST

Updated : Sep 5, 2022, 9:09 AM IST

Rishi Sunak news: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. సోమవారం వెలువడే తుది ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కీలక సమయంలో రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఈ పోటీలో ఓడిపోతే.. తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని గంటల ముందు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడిపోతే.. ఎంపీగా కొనసాగుతూ, తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలిపారు.

'పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతా. ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నా. ప్రజల మద్దతు ఉన్నంతకాలం వారికి అందుబాటులోనే ఉంటా. ఈ క్రమంలో కన్జర్వేటివ్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగానే ఉంటా' అన్నారు. అయితే, తదుపరి కార్యాచరణ ఏంటి? అన్న ప్రశ్నకు రిషి సునాక్‌ సమాధానమిచ్చారు. టోరీ లీడర్‌ ఎన్నికల్లో.. ప్రతికూల ఫలితం ఎదురు కానుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో రిషి సునాక్‌ కూడా అటువంటి సంకేతాలిస్తూ మాట్లాడారు.

ప్రధాని పదవి రేసులో భాగంగా రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. టోరీ ఓటర్లు మాత్రం ట్రస్‌ వైపే మొగ్గు చూపినట్లు సర్వేలు అంచనా వేశాయి. దాదాపు 1.60 లక్షల మంది నమోదిత టోరీ సభ్యులు ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రిటన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం తుది ఫలితం వెలువడనుంది.

Last Updated : Sep 5, 2022, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details