తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్​

బ్రిటన్​ ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్​. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం పాటుపడాలని చూస్తున్నట్లు తెలిపారు.

rishi sunak pm candidate
rishi sunak pm candidate

By

Published : Oct 23, 2022, 5:08 PM IST

బ్రిటన్‌ అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. లిజ్‌ ట్రస్‌ స్థానాన్ని భర్తీ చేసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం పాటుపడాలని చూస్తున్నట్లు తెలిపారు. 42 ఏళ్ల రిషి సునాక్‌ పార్లమెంట్‌లోని 128 మంది టోరీ సభ్యుల మద్దతుతో పార్టీ ప్రధాని పదవికి ముందు వరుసలో ఉన్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించనప్పటికీ.. సునాక్, జాన్సన్, పెన్నీ మోర్డాంట్ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది.

యూకే గొప్ప దేశమన్న రిషి సునాక్‌.. ప్రస్తుతం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. అందుకే తాను బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట దశలో ఉన్నపుడు తాను ఆర్థిక మంత్రిగా తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. ప్రస్తుత సవాళ్లు ఎంత పెద్దవైనప్పటికీ అవకాశాలను సరిగా వినియోగించుకుంటే పరిస్థితిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. 2019 మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. తన ప్రభుత్వంలో ప్రతీ దశలో సమగ్రత, నైపుణ్యం, జవాబుదారీతనం ఉంటాయని.. సవాళ్లు అధిగమించే వరకు పనిచేస్తానని రిషి సునాక్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details