తెలంగాణ

telangana

ETV Bharat / international

'అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అణ్వాయుధ పరీక్షలకు సై'.. పుతిన్​ వార్నింగ్​ - రష్యా ఉక్రెయిన్ యుద్ధంట

పాశ్చాత్య దేశాలపై నిప్పులు చెరిగారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​. . ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం పార్లమెంట్​లో ప్రసంగించిన పుతిన్‌.. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలే కారణమని తేల్చి చెప్పారు.

putin national address
putin national address

By

Published : Feb 21, 2023, 3:45 PM IST

Updated : Feb 21, 2023, 4:49 PM IST

Putin National Address : పశ్చిమ దేశాలు.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసినంత కాలం యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్‌ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటికి దీటుగా స్పందిస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉక్రెయిన్‌లో పర్యటించిన ఒకరోజు తర్వాత పుతిన్.. రష్యా పార్లమెంట్‌ను ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రసంగించిన పుతిన్‌.. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలే కారణమని తేల్చి చెప్పారు. తాము సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ అవతలి వైపు నుంచి సానుకూలత కనపడడం లేదని పుతిన్‌ విమర్శించారు. తాము ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదన్న పుతిన్‌.. కీవ్‌లో నియంతృత్వ పాలన సాగుతోందుని ఆరోపించారు. పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌.. కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదన్న పుతిన్‌.. అమెరికా సహా మిత్రదేశాలు ఈ యుద్ధంలో ఏదో రకంగా పాల్గొంటున్నాయని దుయ్యబట్టారు.

"యుద్ధభూమిలో రష్యాను ఓడించడం సాధ్యం కాదు. అందుకే పాశ్చాత్య దేశాలు.. రష్యా సంస్కృతి, సంప్రదాయాలపై అసత్య ప్రచారాలతో విషం గక్కుతున్నాయి. మేము ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే.. పాశ్చాత్య దేశాలకు ఆధిపత్యం కోసం యత్నిస్తున్నాయి. యుద్ధాన్ని వారు మొదలుపెట్టారు. మేము దానిని అంతం చేయడానికి కృషి చేస్తున్నాము."

--వ్లాదిమర్​ పుతిన్, రష్యా అధ్యక్షుడు

రష్యా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు ప్రతి ఏడాదికి ఒకసారి కచ్చితంగా జాతినుద్దేశించి ప్రసంగించాలి. కానీ 2022లో అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్​ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మరోవైపు ఈ ప్రసంగానికి ముందు మాట్లాడిన రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెక్సోవ్​.. అధ్యక్షుడు ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్​పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ ఏడాది ప్రసంగానికి పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్​, ఐరోపా సమాఖ్య​ అనుకూల మీడియాను నిషేధించామని ఆయన తెలిపారు.

అమెరికాతో అణు ఒప్పందం నిలిపివేత
అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. అణ్వాయుధాల విస్తరణను తగ్గించే లక్ష్యంతో 2010లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. అయితే ఈ ఒప్పందం నుంచి తాము పూర్తిగా వైదొలగలేదని.. అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే.. తాము కూడా అందుకు సిద్ధంగా ఉంటామన్నారు పుతిన్​.

ఇవీ చదవండి :ఉక్రెయిన్​లో బైడెన్ ఆకస్మిక పర్యటన.. భారీగా సైనిక సాయం.. పుతిన్​కు వార్నింగ్!

ఇద్దరికీ ఒకే బాయ్​ఫ్రెండ్.. ఒకేలా కనిపించాలని పళ్లు పీకించుకున్న కవలలు.. వీళ్ల కథ తెలుసా?

Last Updated : Feb 21, 2023, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details