తెలంగాణ

telangana

ETV Bharat / international

తిరుగుబాటుదారులపై కాల్పులు.. 60 మంది మృతి.. సూడాన్​లో మరో 170 మంది. - protests in chad africa

ఆఫ్రికాలోని తిరుగుబాటుదారులపై కాల్పులు జరిపింది అక్కడి సైన్యం. ఈ ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందారు. మరోవైపు సూడాన్​లో మళ్లీ మొదలైన జాతి విధ్వంస ఘటనల్లో దాదాపు 170 మంది మృత్యువాత పడ్డారు.

sudan tribal clashes
protests in african city

By

Published : Oct 21, 2022, 10:22 AM IST

ఆఫ్రికాలోని చడాలోని రెండు అతి పెద్ద నగరాల్లో ప్రభుత్వ తిరుగుబాటుదారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మధ్యంతర నాయకురాలు మహమత్ ఇద్రిస్ డెబీ రెండేళ్ల అధికార పొడిగింపునకు వ్యతిరేకంగా జరిగిన ఈ విధ్వంసం తర్వాత అధికారులు కర్ఫ్యూ విధించారు. రాజధాని నగరం చడాలో దాదాపు 60 మంది మృతి చెందారని చడియన్​ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అనేక మంది గాయాలుపాలయ్యారని చెప్పారు.

సూడాన్‌లో ఘర్షణలు..
ఆ దేశంలోనే సూడాన్​లో గిరిజన తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దక్షిణ భాగంలోని బ్లూనైల్​ ప్రావిన్స్​లో గత రెండువారాలుగా జరుగుతున్న పోరులో దాదాపు 170 మంది మృత్యువాత పడ్డారు. గత కొంతకాలంగా ఈ ప్రావిన్స్​ మొత్తం జాతి హింసతో అల్లాడిపోతోంది. జులైలో చెలరేగిన గిరిజన ఘర్షణలు వల్ల అక్టోబర్ ప్రారంభంలో 149 మందిని చనిపోయారని.. గత వారం మరో 13 మంది మరణించారని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details