Princess Diana Sweater Auction :అందంతోనే కాదు సమాజ సేవతో అంతులేని జనాభిమానం సంపాదించిన ప్రిన్సెస్ డయానా. 80వ దశకంలో తన ఫ్యాషన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి దుస్తులు ధరించినా.. ఎలాంటి ఆభరణాలు పెట్టుకున్నా.. డయానను అబ్బురపడి చూసేవారు. అందుకే ఫ్యాషన్ ప్రపంచంలో ప్రిన్సెస్ డయానా ఓ బ్రాండ్. ఆమె మరణించి 25 ఏళ్లు గడుస్తున్నా.. ప్రజల స్మృతుల్లో ఇంకా మిగిలే ఉన్నారు. తాజాగా డయానా ధరించిన దుస్తులు, వస్తువులను వేలం వేయగా.. వాటిని సొంతం చేసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. రాజకుమారి ధరించిన ఓ స్వెట్టర్ ధర.. అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయల పలికి ఔరా అనిపించింది.
Princess Diana Gown Auction :ప్రముఖ సోత్‌బైస్ ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో ప్రిన్సెస్ డయానా ధరించిన ఎరుపు రంగు స్వెట్టర్.. అంచనాలను మించిన ధర పలికింది. రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు చెల్లించి.. సొంతం చేసుకున్నారు. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన వస్తువులకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి అని సోత్‌బైస్ ఫ్యాషన్ సంస్థ తెలిపింది. వేలం మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్‌బైస్ ఆన్‌లైన్ సంస్థ తెలిపింది. ఇదే సంస్థ జనవరిలో నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్‌ను వేలం వేయగా.. రూ.5 కోట్ల ధర పలికింది