తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్మనీలో మోదీకి ఘనస్వాగతం.. చిన్నారులతో ముచ్చట్లు - మోదీ జీ7 సదస్సు

Modi Germany Tour: జర్మనీ ఛాన్స్​లర్​ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ.. ఆది, సోమవారాల్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఇందుకోసం ఆదివారం ఉదయం జర్మనీ చేరుకున్నారు. జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఉగ్రవాదం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై మోదీ చర్చించనున్నారు.

modi
modi

By

Published : Jun 26, 2022, 9:38 AM IST

Updated : Jun 26, 2022, 11:18 AM IST

జర్మనీలో మోదీ

Modi Germany Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆది, సోమవారాల్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోదీ తెలిపారు.

మోదీకి నమస్కరిస్తున్న చిన్నారి
స్వాగతం పలుకుతున్న ఎన్​ఆర్​ఐలు

సదస్సులో పాల్గొనే జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. షోల్జ్‌ సహా సదస్సులో పాల్గొంటున్న పలు దేశాల నేతలతో ప్రత్యేక భేటీలకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఐరోపాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులనూ కలవనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ఏడు ధనిక దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని జర్మనీ చేరుకున్నారు.

అభివాదం చేస్తున్న మోదీ
జర్మనీ పర్యటన అనంతరం మోదీ.. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ దేశానికి వెళ్లనున్నారు. గల్ఫ్​ దేశ మాజీ అధ్యక్షుడు షేక్​ ఖలీఫా ఇటీవలే మరణించినందున.. వారి కుటుంబసభ్యులను మోదీ పరామర్శించనున్నారు.
Last Updated : Jun 26, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details