తెలంగాణ

telangana

ETV Bharat / international

Putin Praises Modi : 'ఆ విషయంలో ఆయనే స్ఫూర్తి'.. మోదీపై పుతిన్ ప్రశంసలు

Putin Praises Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసించారు. భారత ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని పుతిన్‌ మెచ్చుకున్నారు.

putin praises modi
putin praises modi

By

Published : Jun 30, 2023, 11:00 AM IST

Updated : Jun 30, 2023, 11:57 AM IST

Putin Praises Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రష్యాకు మంచి మిత్రుడు, భారత ప్రధాని మోదీ కొన్నేళ్ల క్రితం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని.. దాని ఫలితాలు భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పుతిన్‌ చెప్పారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్‌.. రష్యాలో తయారయ్యే ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించాలంటూ భారత్‌ ప్రస్తావన తెచ్చారు. తాము కాకపోయినా.. తమ స్నేహితుడు చేసిందేదైనా సత్ఫలితాలిస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదని పుతిన్ ప్రశంసించారు.

"భారత్‌లోని మన స్నేహితులు, రష్యాకు గొప్ప స్నేహితుడైన ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొన్ని ఏళ్ల కింద మేకిన్‌ ఇండియా అనే పథకాన్ని తీసుకువచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కాకపోయినా.. మన స్నేహితుడు చేసిందైన సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదు"

--వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

అంతకుముందు కూడా భారత్‌లో రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్‌.. ఇరు దేశాల సంబంధాల గురించి మాట్లాడారు. రష్యా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్మామ్యం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. 'ప్రతి రోజు రష్యా గురించి అంతర్జాతీయ స్థాయిలో అవాస్తవాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ, నిజం ఏంటంటే.. రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతూనే ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

'మోదీ గొప్ప దేశ భక్తుడు'
గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయనను దేశభక్తునిగా అభివర్ణించారు. మోదీ నేతృత్వంలో భారత్​.. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తోందని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆర్థికంగానూ దేశం కీలక పురోగతి సాధించిందని కితాబిచ్చారు. మోదీని దేశభక్తుడిగా అభివర్ణించారు. మాస్కోలో గురువారం వాల్డాయ్​ డిస్కషన్​ క్లబ్ అనే ఓ సంస్థను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Jun 30, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details