తెలంగాణ

telangana

ETV Bharat / international

నేరస్థుల కోసం పోలీసుల రైడ్​.. కాల్పుల్లో 21 మంది మృతి - బ్రెజిల్​ రియో వార్తలు

Brazil shooting news: పోలీసులు - నేరస్థుల మధ్య జరిగిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బ్రెజిల్​లోని రియో డి జెనీరియోలో జరిగింది. మృతిచెందిన వారిలో సామాన్యులు కూడా ఉన్నారు.

కాల్పులు
కాల్పులు

By

Published : May 25, 2022, 9:46 AM IST

Brazil shooting news: బ్రెజిల్‌లో నేరస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నేరస్థులను అరెస్ట్ చేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రియో డి జెనీరియోలోని విలా క్రూజెరియో ఫావెలా ప్రాంతంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా నేరస్థుల ముఠా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఓ వ్యక్తి మరణించారని, మరో 11 మందికి గాయాలైనట్లు బ్రెజిల్ పోలీసులు తొలుత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

అయితే బుల్లెట్ గాయాలతో ఉన్న అనేక మందిని ఫావెలా ప్రాంత వాసులు అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారిలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. మొత్తం 21 మంది చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి.

ఇదీ చూడండి :పాఠశాలలో మారణహోమం.. కాల్పుల్లో 21 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details