Gas leak in Jordan: జోర్డాన్‌లో విషవాయువులు లీకై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాన ఉన్న అకాబా నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 251 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. గ్యాస్ ట్యాంకును రవాణా చేస్తుండగా ప్రమాదవశాత్తు లీక్ అయిందని జోర్డాన్ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ వెల్లడించింది. ట్యాంకర్లో ఏముందనేది ఇంకా తేలలేదని పేర్కొంది. ఘటనాస్థలాన్ని అధికారులు సీల్ చేశారని.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారని వివరించింది. గ్యాస్ లీక్‌పై దర్యాప్తు జరిపేందుకు నిపుణులను రంగంలోకి దించిందని పేర్కొంది.
విషవాయువులు లీక్.. 13 మంది మృతి.. 251 మందికి అస్వస్థత - poisonous gas leak in Jordan
Jordan poisonous gas leak: జోర్డాన్‌లో దారుణం జరిగింది. ఓ ట్యాంకర్‌లోని విషవాయువు లీకై 13 మంది చనిపోయారు. 251 మంది అస్వస్థతకు గురయ్యారు.
Jordan poisonous gas leak
Last Updated : Jun 28, 2022, 8:59 AM IST