Modi Putin phone call: ఉక్రెయిన్ సమస్యను సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కారించుకోవాలన్న తమ వైఖరిలో మార్పులేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ఉక్రెయిన్ అంశంపై తమ దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. గతేడాది పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుతీరుపై ఇరువురు నేతలు సమీక్షించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పుతిన్‌కు మోదీ ఫోన్! ఆ అంశంపైనే సుదీర్ఘ చర్చ
Modi Putin phone call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సమస్యను సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కారించుకోవాలన్న తమ వైఖరిలో మార్పులేదని పునరుద్ఘాటించారు.
modi putin news
వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించటంపై వారు తమ ఆలోచనలు షేర్ చేసుకున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన, ఆహార మార్కెట్ల పరిస్థితి సహా ప్రపంచవ్యాప్త సమస్యలపై చర్చించారు. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై క్రమంగా సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇదీ చదవండి:ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి- 18 మంది బలి