Modi Gifts To Dignitaries: ఐరోపా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్ రాజ కుటుంబీకులకు, పలుదేశాల ప్రధానులకు బహుమతులు అందజేశారు. భారతదేశ వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులను మోదీ బహమతులుగా అందించారు. డెన్మార్క్ మహారాణి మాగ్రెత్-2 కు గుజరాత్ నుంచి తీసుకెళ్లిన రోగాన్ పెయింటింగ్‌ను ప్రధాని మోదీ కానుకగా అందజేశారు.
ఆ దేశాల ప్రధానులకు మోదీ విలువైన కానుకలు - modi costly gifrs
Modi Gifts To Dignitaries: మూడు రోజుల ఐరోపా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. డెన్మార్క్ రాజ వంశీయులకు, పలు దేశాల ప్రధానులకు విలువైన బహుమతులు అందజేశారు. భారత్‌లో వివిధ ప్రదేశాల వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులను.. వారందరికీ మోదీ అందించారు.
డెన్మార్క్ యువరాజు ఫ్రెడ్రిక్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డోక్రా బోట్‌ను కానుకగా అందజేసిన మోదీ.. యువరాణి మేరీకి వారణాసి నుంచి తీసుకువెళ్లిన వెండి మీనాకరి పక్షి బొమ్మను బహుమతిగా అందజేశారు. స్వీడన్ ప్రధాని మాగ్దలెనా ఆండర్సన్‌కు జమ్ముకశ్మీర్‌కు చెందిన పషిమినా స్టోల్‌ను బహూకరించిన మోదీ.. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్‌సన్‌కు కచ్ ఎంబ్రాయిడరీతో కూడిన వాల్ హేంగింగ్ బహుమతిగా ఇచ్చారు. నార్వే ప్రధాని జోనాస్‌కు రాజస్థాన్ నుంచి తీసుకెళ్లిన కోఫ్ట్‌గిరి కళతో కూడిన ధాల్‌ను కానుకగా ఇచ్చారు. ఫిన్‌లాండ్ ప్రధాని సనామారిన్‌కు రాజస్థాన్ నుంచి తెచ్చిన ట్రీ ఆఫ్ లైఫ్‌ను బహుమతిగా అందించారు.
ఇదీ చదవండి:Modi EU Tour: 'ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ జరగాలి'