తెలంగాణ

telangana

ETV Bharat / international

'నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచాన్ని నడిపేది మనమే' - మోదీ జర్మనీ భారత సంతతి స్పీచ్

PM MODI SPEECH IN GERMANY: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్.. వెనుకబడిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జర్మనీలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. వలస ప్రాంతంగా ఉండటం వల్ల తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను దేశం పొందలేకపోయినట్లు చెప్పారు.

PM MODI SPEECH IN GERMANY
PM MODI SPEECH IN GERMANY

By

Published : Jun 26, 2022, 8:19 PM IST

PM MODI IN GERMANY: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ వెనుకబడబోదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోందని పేర్కొన్నారు. జర్మనీలోని మ్యూనిచ్​లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. పారిశ్రామిక విప్లవం సమయంలో భారత్ వలసదేశంగా ఉందని గుర్తు చేశారు. అందువల్లే ఆ పారిశ్రామిక విప్లవం ద్వారా తగిన ప్రయోజనం పొందలేకపోయిందని వ్యాఖ్యానించారు.

'ఒకప్పుడు స్టార్టప్​ల రేసులో భారత్ ఎక్కడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు స్టార్టప్ రంగంలో మూడో అతిపెద్ద ఎకోసిస్టమ్​గా మారాం. చిన్నచిన్న ఫోన్లను సైతం దిగుమతి చేసుకునే దశ నుంచి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుడిగా ఎదిగాం. ఇండియాలో వాతావరణ మార్పులు రాజకీయానికి సంబంధించిన విషయమే కాదు. పర్యావరణ అనుకూల సుస్థిర కార్యక్రమాలు ప్రజల జీవనవిధానంలో భాగం. దేశంలో 10 కోట్లకు పైగా టాయిలెట్లను మేం నిర్మించాం. ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి. అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లభించింది. 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం. ఇప్పుడు ప్రజలు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత తమదే అని గ్రహించారు' అని మోదీ చెప్పుకొచ్చారు.

భారత ప్రజాస్వామ్యంపై 47ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు అప్పట్లో ప్రయత్నం జరిగిందని ఆయన మండిపడ్డారు. భారత పౌరులు ఎక్కడ ఉన్నా.. ప్రజాస్వామ్యాన్ని గర్వంగా భావిస్తారని అన్నారు. భారత్.. ప్రజాస్వామ్యాలకు తల్లి వంటిదని గర్వంతో చెప్పుకుంటారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details