Pm Modi South Africa Visit 2023 : భారత్.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ మీట్లో పాల్గొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ భారత్ ముందంజలో ఉందన్నారు. 100 యూనికార్న్‌లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పారు.
"జీఎస్‌టీ అమలుతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు రంగానికి తలుపులు తెరిచాం. భారత్‌లో వీధి వ్యాపారులు కూడా యూపీఐ వాడుతున్నారు. భారత్‌ను తయారీ హబ్‌గా రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సౌర, పవన విద్యుత్ రంగాల్లో భారత్‌ను తయారీ కేంద్రంగా మారుస్తున్నాం. విద్యుత్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా మారుస్తున్నాం"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మోదీకి ఘన స్వాగతం
Brics Summit 2023 :అంతకుముందు దక్షిణాప్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు ఆ దేశ ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే. అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గ్రీస్‌కు ప్రధాని మోదీ
Modi Greece Visit :ప్రధాని మోదీ ఆగస్టు 22- 24 వరకు 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడం వల్ల దీనికి ప్రాధాన్యం పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరయ్యారు. పుతిన్ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సదస్సులో పాల్గొనన్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
PM Modi South Africa Visit : బ్రిక్స్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా?
బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు బయల్దేరిన మోదీ.. ఆ నేతలతో మాత్రమే చర్చలు!