తెలంగాణ

telangana

ETV Bharat / international

టోక్యోలో అడుగుపెట్టిన మోదీ.. జపాన్ టూర్ షురూ - జపాన్​లో ల్యాండ్ అయిన మోదీ

PM Modi in Japan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్​లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్​కు వెళ్లిన ఆయన.. క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలతో సమావేశం కానున్నారు.

PM JAPAN VISIT
PM JAPAN VISIT

By

Published : May 23, 2022, 5:04 AM IST

PM Modi Japan tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్​కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన ఆయన.. సోమవారం ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు. ఈ మేరకు జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు జపాన్ అధికారులు ఘన స్వాగతం పలికారు.

క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్‌ వెళ్లిన ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో పాటు వ్యాపారవేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతోనూ సమావేశం కానున్నారు. దాదాపు 40 గంటల పాటు ఆయన జపాన్‌లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.

Modi Japan tour meetings: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధాన మంత్రులతో నిర్వహించే ద్వైపాక్షిక భేటీలతో పాటు వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. మోదీ ఒక రాత్రి టోక్యోలో, మరో రెండు రాత్రులు విమాన ప్రయాణంలో ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:తగ్గని వరద ఉద్ధృతి.. అసోంలో మరో ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details