తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌ పురోగతిలో ఫ్రాన్స్ సహజ భాగస్వామి.. వచ్చే 25 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం!: మోదీ

PM Modi France visit : ఎంతటి సంక్లిష్ట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్‌ విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్​ పురోగతిలో ఫ్రాన్స్ సహజ భాగస్వామి అని తెలిపారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల మంది భారతీయులకు చెల్లుతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ద్వైపాక్షిక అనంతరం ప్రధాని మోదీ అక్కడి మీడియాతో మాట్లాడారు.

pm modi France visit
pm modi France visit

By

Published : Jul 14, 2023, 10:21 PM IST

Updated : Jul 14, 2023, 10:54 PM IST

PM Modi France visit : భారత్‌ పురోగతిలో ఫ్రాన్స్ సహజ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫ్రాన్స్‌తో భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పి 25 సంవత్సరాలు పూర్తయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. రానున్న 25 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం, అణుశక్తి, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర అంశాల్లో సహకారం దిశగా మరింత ముందుకు వెళ్తామని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు ఫ్రాన్స్‌ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు.

చీఫ్ గెప్ట్​గా..
Bastille Day France Chief Guest : ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాస్టీల్‌ డే పరేడ్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి వీక్షించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌' అవార్డుతో మోదీని ఫ్రాన్స్‌ సత్కరించింది.

మేక్రాన్-మోదీ సమావేశం..
Macron Modi Summit : బాస్టిల్​ పరేడ్‌ అనంతరం ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలబలోపేతంపై విస్త్రృతంగా చర్చించారు. అనంతరం మేక్రాన్‌తో కలిసి, మోదీ మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల మంది భారతీయులకు చెల్లుతుందన్నారు. భారత్‌లో అవలంబిస్తున్న యూపీఐ పేమెంట్‌ విధానాన్ని ఫ్రాన్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు సమ్మతించినట్లు తెలిపారు. కొవిడ్‌, ఉక్రెయిన్‌ సంక్షోభాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

'దౌత్యమార్గాల ద్వారా పరిష్కారం'
Emmanuel Macron Modi : ఫ్రాన్స్‌లోని భారతీయుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక వీసా విధానాన్ని ప్రధాని స్వాగతించారు. భారతదేశంలో క్యాంపస్‌లను తెరవడానికి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఆయన ఆహ్వానించారు. ఈ వ్యూహాత్మక చర్యలు రెండు దేశాల మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఎంత సంక్షిష్టమైన వివాదాలనైనా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్‌ పూర్తిగా విశ్వసిస్తోందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. శాంతిస్థాపనకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో సహకారానికి ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.

సంక్షోభాలకు భారత్​తో కలసి పరిష్కారం..
2030 నాటికి 30 వేలమంది ఫ్రెంచ్ విద్యార్థులను భారత్​కు పంపాలనుకుంటున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ యువకుల కోసం.. వీసా విధానాన్ని సరళీకరించాలనుకుంటున్నామని చెప్పారు. పారిస్ నడిబొడ్డున జరిగిన బాస్టిల్ డే పరేడ్‌లో పంజాబ్ రెజిమెంట్‌ పాల్గొనడం చూసి గర్వపడ్డానన్నానని మేక్రాన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ సంక్షోభాలకు భారత్​-ఫ్రాన్స్ కలిసి పరిష్కారాన్ని కనుక్కొగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీకి మేక్రాన్ గిఫ్టులు..
Macron Gifts Modi : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రధాని మోదీకి కొన్ని ప్రత్యేక కానుకలు బహూకరించారు. వీటిలో ప్రముఖ ఫ్రెంచ్‌ రచనలు, 11వ శతాబ్దంనాటి చార్లెమాగ్నే చెస్‌ బోర్డ్ నమూనాతోపాటు 1916లో తీసిన ఫొటో కాపీలు ఉన్నాయి. 1913-1927 మధ్య ఫ్రెంచ్‌ రయిత మార్సెల్‌ ప్రౌస్ట్ 'ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌' పేరుతో చేసిన రచనలతోపాటు, 20వ శతాబ్దంలో అతి ముఖ్యమైనవిగా పరిగణించే ఫ్రెంచ్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను ప్రధాని మోదీకి మేక్రాన్‌ బహూకరించారు. అలాగే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గందపు చెక్కతో తయారుచేసిన సితార్‌ను కానుకగా ఇచ్చారు.

Last Updated : Jul 14, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details