తెలంగాణ

telangana

ETV Bharat / international

'అబే మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు'.. జపాన్​ ప్రధానితో మోదీ భేటీ - మోదీ జపాన్ పర్యటన

PM Modi Attend Shinzo Abe Funeral : జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వెళ్లిన మోదీ.. జపాన్​ ప్రధాని ఫ్యూమియో కిషిదతో సమావేశమయ్యారు.

PM Modi Attend Shinzo Abe Funeral
PM Modi Attend Shinzo Abe Funeral

By

Published : Sep 27, 2022, 10:08 AM IST

PM Modi Attend Shinzo Abe Funeral : జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో తాను జపాన్​కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని చెప్పారు. అబే.. భారత్​, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను​ మరో ఎత్తుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మోదీ.

మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్లిన నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషిద. అంతకుముందు మేలో జరిగిన క్వాడ్​ సమ్మిట్​లో పాల్గొన్న మోదీ.. కిషిదతో సమావేశమయ్యారు.

జపాన్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన అబే.. గత నెల హత్యకు గురయ్యారు. ఆయన నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అబే ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం మంగళవారం అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండోప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. అంతకుముందు 1967లో మాజీ ప్రధాని షిగెరు యోషిదాకు ఈ గౌరవం దక్కింది.

ఇవీ చదవండి;బ్రిటన్​ రాణికన్నా ఎక్కువ ఖర్చు.. ఘనంగా మాజీ ప్రధాని అంత్యక్రియలు.. మోదీ హాజరు

వరద నీటిలోనే 'పాక్​' పొలాలు.. ప్రజల ఆకలికేకలు.. సాయం కోసం ఎదురుచూపులు..

ABOUT THE AUTHOR

...view details