Philippines Bus Accident: బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటం వల్ల 16 మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన సెంట్రల్ ఫీలిప్పీన్స్లోని మనీలాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన బస్సు ఇలోయిల్ ప్రాంతం నుంచి వస్తోంది. పర్వత ప్రాంతాల సమీపంలోని ఓ మలుపు దగ్గర బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పొయాడు. దీంతో బస్సు కాంక్రీటు రెయిలింగ్‌కు ఢీకొట్టి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు ఆర్మీ, అత్యవసర ప్రతిస్పందన బృందాలు కలిసి సహాయక చర్యల్లో పాల్గొనట్లు అధికారులు తెలిపారు.
బాధితుల కోసం అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించామని అత్యవసర ప్రతిస్పందన అధికారి పబస్టన్ తెలిపారు. లోయలో దట్టమైన చెట్లు ఉండటం వల్ల బాధితుల కోసం గంటల కొద్ది శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. అలానే స్థానికులకు లోయలో ఇంకా ఎవరైన కనిపిస్తే వెంటనే ప్రాంతీయ అధికారులకు తెలియజేయాలని పబస్టన్ తెలిపారు.