గాల్లో ఎగురుతున్న విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈనెల 14న పెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న పాకిస్థాన్ విమానంలో సిబ్బందితో గొడవకు దిగిన ఓ వ్యక్తి.. నానా రచ్చ చేశాడు. విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు.
గాల్లో ప్రయాణిస్తున్న విమానం కిటికీలను కాళ్లతో తన్నాడు. వాటిని పగలగొట్టేందుకు యత్నించాడు. అనంతరం కింద బోర్లా పడుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. విమానయాన చట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. దుబాయ్‌లో విమానం దిగిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.