పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం - brakes failed and truck collided with bus
పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన ఓ ట్రక్ నేరుగా బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు.
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బస్సును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పెషావర్‌లోని సింధు రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంక్ గవర్నర్ హాజీ గులాం అలీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆజం ఖాన్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.