తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పు కోసం ఐఎంఎఫ్ షరతులను ఒప్పుకుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్‌ను తీర్చడానికి.. పాక్ ప్రభుత్వం డాలర్ క్యాప్‌ను తొలగించింది. దీని ఫలితంగా పాకిస్థాన్ రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 276.58 రూపాయలకు చేరింది. చమురు దిగుమతులకు డాలర్‌పై ఆధారపడ్డ పాక్ చమురు కంపెనీలు తాము పతనం అంచున ఉన్నామని లబోదిబోమంటున్నాయి.
జీవితకాల కనిష్ఠానికి పాక్ రూపాయి.. చమురు కంపెనీలు పతనం.. ప్రజలపై పన్ను బాదుడు! - పాకిస్థాన్ పెట్రోల్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్ అప్పుల కోసం నానా తిప్పలు పడుతోంది. మరో దిక్కులేక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) విధించిన కఠిన షరతులకు తలొగ్గుతోంది. ఐఎంఎఫ్ డిమాండ్ మేరకు డాలర్ క్యాప్‌ను తొలగించింది. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారక విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయి 276కు చేరింది. ప్రస్తుతం తాము పతనం అంచున ఉన్నామని పాక్ చమురు కంపెనీలు లబోదిబోమంటున్నాయి.
పెట్రోల్‌పై పన్నును 20 నుంచి 30 రూపాయలు పెంచాలని ఐఎంఎఫ్ ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై 50 రూపాయలుగా ఉన్న పన్ను 70 నుంచి 80 రూపాయలకు ఎగబాకే అవకాశం ఉంది. మినీ బడ్జెట్ ద్వారా చక్కెర పానీయాలపై ఫెడరల్ ఎక్సైజ్ సుంకాన్ని 13 శాతం నుంచి 17 శాతానికి పెంచడానికి కూడా పాకిస్థాన్ సిద్ధమవుతోంది. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచాలని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సూచించింది.
పాకిస్థాన్ దిగుమతి బిల్లులో ఇంధన దిగుమతులదే సింహభాగం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పాకిస్థాన్ రూపాయి విలువ క్షీణించడం వల్ల ఆ దేశ ఇంధన రంగం తీవ్ర నష్టాల్లో ఉంది. పాకిస్థాన్‌లోని విదేశీమారక నిల్వలు పదేళ్ల కనిష్ఠానికి చేరి 3.09 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి కొన్నిరోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ ఆదుకోకపోతే పాకిస్థాన్ మరో శ్రీలంకగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.