Shahbaz Sharif on India: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐరాస భద్రతా మండలి నియమాలకు అనుగుణంగా.. జమ్ముకశ్మీర్ వివాదానికి శాంతియుత, న్యాయమైన పరిష్కారాన్ని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా వచ్చిన నీల్ హాకిన్స్‌ను ఇస్లామాబాద్‌లో కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పాక్ ప్రధాని.
దక్షిణాసియాలో శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం కీలక పాత్ర పోషించాలి. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం సహా విభిన్న రంగాలలో ఆస్ట్రేలియాతో సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకుంటాం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తాం.
--షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని
ఇప్పటికే పలుమార్లు జమ్ముకశ్మీర్.. భారత్‌లో అంతర్భాగమని భారత్ స్పష్టం చేసినా పాక్ తన వైఖరిని మార్చుకోవట్లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు.
మరోవైపు.. కొద్ది రోజుల క్రితం లాహోర్‌లో భారత్ విదేశాంగ విధానాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయని, తమ ప్రజలకు కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని జైశంకర్ వ్యాఖ్యానించిన క్లిప్‌ను ఇమ్రాన్ ప్లే చేశారు.
ప్రస్తుత పాకిస్థాన్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోతోందని కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలుకు సంప్రదింపులు జరిపామని కానీ ప్రస్తుత పాక్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఆ పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలు పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఇమ్రాన్ అన్నారు. ఈ బానిసత్వానికి తాను వ్యతిరేకమని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇమ్రాన్‌ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు.
ఇవీ చదవండి:తీవ్ర కరవు, ప్రజల నానా పాట్లు, వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్
ప్రపంచమంతటా బానిసత్వం, భారత్‌లో బలవంతపు పెళ్లిళ్లు, ఐరాస నివేదిక