తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో భారీ వర్షాలకు 25 మంది బలి.. అతి తీవ్ర తుపానుగా 'బిపోర్​ జాయ్​' - latest cyclone bulletin

Pakistan Heavy Rains : పాకిస్థాన్​లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా 25 మంది మరణించగా.. సుమారు 145 మంది గాయపడ్డారు. స్తంభాలు కూలడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

Pakistan Heavy Rains
Pakistan Heavy Rains

By

Published : Jun 11, 2023, 10:19 AM IST

Updated : Jun 11, 2023, 10:36 AM IST

Pakistan Heavy Rains : పాకిస్థాన్​లో కురిసిన భారీ వర్షాలకు 25 మంది పౌరులు మరణించారు. మరో 145 మంది గాయాలపాలయ్యారు. వాయవ్య పాకిస్థాన్​లో భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా చెట్లు, కరెంట్​ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని సీనియర్ రెస్క్కూ ఆఫీసర్​ ఖటీర్ అహ్మద్​ తెలిపారు. ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోని బన్ను, లక్కి మర్వాత్​, కరక్ జిల్లాలో భారీగా వర్షాలు పడినట్లు ఆయన చెప్పారు. నిర్వాసితులకు అత్యవసర సాయం అందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.

తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు

ప్రధాని షరీఫ్ విచారం
వరదల్లో చిక్కుకుని 25 మంది మృతి చెందడం పట్ల ఆ దేశ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ విచారం వ్యక్తం చేశారు. సహయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అరేబియా సముద్రంలో వచ్చిన బిపోర్​ జాయ్​​ తుపాను తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుపాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దక్షిణ పాకిస్థాన్​ వైపు దూసుకు వస్తున్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.

తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు
తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు

గతేడాది 1,700 మంది బలి
Pakistan Floods 2022 : గతేడాది కూడా పాకిస్థాన్​ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ​ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,700 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.

అతి తీవ్ర తుపానుగా 'బిపోర్​ జాయ్​'
Biporjoy Cyclone Latest News : మరోవైపు, అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపోర్‌ జాయ్‌ అతి తీవ్ర తుపానుగా ఆదివారం ఉదయం మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోందని, జూన్ 15 నాటికి పాకిస్థాన్​లోని కరాచీ సహా, సమీపాన ఉన్న గుజరాత్​లోని సౌరాష్ట్ర, కచ్‌ తీరాలను తాకే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ముంబయికి దక్షిణంగా 610 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సౌరాష్ట్ర, కచ్‌ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ ప్రాంతంలో తీరాన్ని తాకనుందనే విషయంపై.. త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పింది.

ఇవీ చదవండి :పాక్​ను ముంచెత్తిన వరద, 982 మంది బలి, నిరాశ్రయులైన 3.3 కోట్ల మంది

సగానికిపైగా పాకిస్థాన్‌ వరదలోనే, 1100 దాటిన మృతులు, మోదీ ఏమన్నారంటే

Last Updated : Jun 11, 2023, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details