తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో వికీపీడియా బ్యాన్​.. అదే కారణమట..! - పాకిస్థాన్​లో సామాజిక మాధ్యమాలు బంద్

దైవదూషణకు సంబంధించిన కంటెంట్ తొలగించలేదనే కారణంతో వికీపీడియాపై పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) నిషేధం విధించింది. వికీపీడియాకు నోటీసులు పంపినా స్పందించలేదని పీటీఏ అధికారి మలహత్ తెలిపారు.

pakistan wikipedia ban
పాకిస్థాన్​లో వికీపీడియా బ్యాన్

By

Published : Feb 4, 2023, 4:03 PM IST

పాకిస్థాన్​లో వికీపీడియాను ఆ దేశ టెలికాం అథారిటీ నిషేధించింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించకపోవడం వల్ల వికీపీడియాపై వేటు పడినట్లు పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) అధికార ప్రతినిధి మలహత్ ఒబాద్​.. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. నిబంధనలను పాటించకపోవడం వల్లే వికీపీడియాపై నిషేధం విధించినట్లు చెప్పారు. హైకోర్టు సూచన మేరకు వికీపీడియాకు యాక్సెస్ లేకుండా చేసినట్లు ​పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే వికీపీడియాను 48 గంటలపాటు యాక్సెస్ లేకుండా చేసి పాకిస్థాన్ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

అంతకుముందు.. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు నోటీసు జారీ చేసినట్లు పీటీఏ అధికార ప్రతినిధి మలహత్​ తెలిపారు. అయితే వికీపీడియా కంటెంట్‌ను తొలగించగా పోగా.. వివరణ కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను తొలగిస్తే నిషేధం తొలగించే అంశంపై పునరాలోచిస్తామని తెలిపారు.

'పాకిస్తాన్ ప్రభుత్వం వికీపీడియాను పునరుద్ధరిస్తుందని మేం ఆశిస్తున్నాం. ప్రజలు నాలెడ్జ్​ను అందుకోవడం, ప్రపంచంతో పంచుకోవడానికి వికీపీడియా ఉపయోగపడుతుంది.' అని వికీపీడియా అధికారి ఒకరు తెలిపారు. దైవదూషణకు పాల్పడినందుకు సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్​బుక్​, యూట్యూబ్ వంటివి పాకిస్థాన్​లో పలుమార్లు నిషేధం ఎదుర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details