తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. 110 మంది దుర్మరణం

100 killed in explosion at Nigeria: నైజీరియాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 100 మందికి పైగా కార్మికులు మరణించారు. అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ఇంతటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

100 killed in explosion at Nigeria
100 killed in explosion at Nigeria

By

Published : Apr 24, 2022, 9:58 AM IST

Updated : Apr 25, 2022, 3:29 AM IST

100 killed in explosion at Nigeria: నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.

"ఇమో అటవీ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటివరకు 110 మృతదేహాలను గుర్తించాం."

-కొలిన్స్​ అజీ, చమురు సంస్థల నాయకుడు

నైజీరియా ప్రాంతంలో అక్రమ చమురు శుద్ధి కేంద్రాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిపై అనేక ఫిర్యాదులు తరచూ వస్తుంటాయి. చమురు సంస్థలకు సరఫరా చేసే పైప్​లైన్ల నుంచి ముడి చమురును చోరీ చేసి శుద్ధి చేస్తారు. వీటి వల్ల నైజీరియా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరుగుతూ ఉంటుంది.

ఇదీ చదవండి:కట్టుబట్టలతో దేశం దాటిన అభాగ్యుడికి రూ.2కోట్ల లాటరీ.. అయినా బ్యాడ్​ లక్!

Last Updated : Apr 25, 2022, 3:29 AM IST

ABOUT THE AUTHOR

...view details