తెలంగాణ

telangana

By PTI

Published : Jan 16, 2024, 9:57 AM IST

ETV Bharat / international

కిమ్ కటీఫ్- దక్షిణ కొరియాతో మాటలు బంద్- త్వరలో రాజ్యాంగ సవరణ!

North Korea vs South Korea Kim Jong Un : దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులు రద్దు చేసుకుంటున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రభుత్వ సంస్థలను రద్దు చేసింది. ఆ దేశంతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేసేది లేదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు.

north-korea-vs-south-korea
north-korea-vs-south-korea

North Korea vs South Korea Kim Jong Un :దక్షిణ కొరియాతో సంప్రదింపులు జరిపే కీలక ప్రభుత్వ ఏజెన్సీలను ఉత్తర కొరియా రద్దు చేసింది. పార్లమెంట్​ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. "రెండు కొరియాలు ఇప్పుడు తీవ్రంగా ఘర్షణ పడుతున్నాయి. ఈ సమయంలో దక్షిణ కొరియాను దౌత్యపరమైన భాగస్వామిగా పరిగణించడం పెద్ద తప్పు అవుతుంది" అని ఉత్తర కొరియా పార్లమెంట్ తన ప్రకటనలో పేర్కొంది. శాంతియుత దేశ పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్​లను రద్దు చేయడం సహా చర్చలు, సహకారం, సంప్రదింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

'సయోధ్య కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయం'
పార్లమెంట్​లో ప్రసంగిస్తూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ కొరియాతో సయోధ్య కోసం ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయబోనని కిమ్ తేల్చి చెప్పారు. దక్షిణ కొరియాను దేశపు నంబర్ 1 శత్రువుగా గుర్తించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని పార్లమెంట్​కు పిలుపునిచ్చారు. వచ్చే సమావేశంలో రాజ్యాంగాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు.

శాంతియుత జాతీయ ఏకీకరణ కమిటీ ఇరుదేశాల వ్యవహారాలను చూసుకుంటుంది. 1961లో ఉభయ కొరియా దేశాలు ఏర్పడినప్పటి నుంచి ఈ కమిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, టూరిజం అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉభయ దేశాల టూరిజం ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాయి. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి.

ఇటీవల కాలంలో కిమ్ ఉపగ్రహాలు, ఆయుధాల ప్రయోగాలు ఉద్ధృతం చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలకు తరచుగా హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కిమ్​కు హెచ్చరికగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఈ విన్యాసాలపైనా కిమ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఏడాది అమెరికా, దక్షిణ కొరియాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశాలపై కిమ్ మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న కిమ్​- ఆయన్ను చూసి ఏడ్చిన ప్రజలు- వీడియో వైరల్​

కొరియాలోకి అమెరికా 'అణు' సబ్​మెరైన్.. మిసైల్స్​ ప్రయోగించి కిమ్ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details