సరికొత్త వ్యూహాత్మక ఆయుధ తయారీ దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా 'హై-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయెల్ మోటార్' పరీక్షను నిర్వహించింది. ఇది శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి దోహదపడనుంది. అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని రూపొందిస్తోంది. దేశ వాయవ్య ప్రాంతంలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో గురువారం ఈ పరీక్షను నిర్వహించినట్లు ఉత్తర కొరియా అధికార సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని తమ దేశ నేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించినట్లు తెలిపింది.
అమెరికా టార్గెట్గా ఉత్తర కొరియా కీలక పరీక్ష.. కిమ్ పర్యవేక్షణలోనే..
ఉత్తర కొరియా శక్తిమంతమైన సరికొత్త వ్యూహాత్మక ఆయుధ తయారీ దిశగా ముందడుగు వేసింది. అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ కీలక పరీక్షను నిర్వహించింది.
వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి పరీక్షను దేశంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని వివరించింది. దీని ఆధారంగా కొత్తరకం వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడించింది. అది చాలా స్వల్పకాలంలోనే సాకారమవుతుందని కిమ్ ఆశిస్తున్నారని పేర్కొంది. కేసీఎన్‌ఏ చెబుతున్న ఆ అస్త్రం.. ఘన ఇంధనంతో నడిచే ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు పలు హైటెక్ ఆయుధాలను ప్రవేశపెడతామని ఆయన గత ఏడాది ప్రకటించారు.
బహుళ వార్‌హెడ్లు కలిగిన అస్త్రాలు, సముద్రగర్భం నుంచి ప్రయోగించే వీలున్న అణ్వస్త్ర క్షిపణులు, నిఘా ఉపగ్రహాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇలాంటి పరీక్షను ఉత్తర కొరియా నిర్వహిస్తుందని చాలా కాలంగా అంచనా వేస్తున్నాం. భారీ ఘన ఇంధన రాకెట్ మోటార్ల వల్ల ప్రతిదాడులను తట్టుకోగల ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేయడానికి వీలవుతుంది’’ అని వ్యూహాత్మక అంశాల నిపుణుడు అంకిత్ పాండా పేర్కొన్నారు.